Mandinchu Prabhuva Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Mahima Kiritam

మండించు ప్రభువా నీ ఆత్మ నాలో | Mandinchu Prabhuva Song Lyrics | Latest Telugu Christian Songs 2024 | Mahima Kiritam

Mandinchu Prabhuva Song Lyrics

Mandinchu Prabhuva Song Lyrics

పల్లవి:
మండించు ప్రభువా నీ ఆత్మ నాలో –
ప్రకాశించెద నీ ప్రతిబింబమై
రగిలించు ప్రభువా ఉజ్జీవము –
వెలిగించెద అనేకులను ॥2॥

అను పల్లవి:
అభిషేకించయా నన్ను మండించయా-
నాపై ప్రోక్షించయా నీ ఆత్మను ॥2॥

అంత్యకాలపు అభిషేకం కుమ్మరించుము మాపైన
మండుచున్న పొదలాగ ఆరకుండ మండించయ్యా ॥2॥
పెంతెకోస్తు దినమున దిగిన ఆత్మవర్షము కురిపించయ్యా
మేడగదిలో పొందిన అనుభవం నేడు మాకు ఇమ్మయ్యా
||అభిషేకించయా||

అంధకార శక్తులను నీదు ఆత్మతో బంధించయ్యా
దాగివున్న సర్పములన్‌ కాల్చివేయుము నీ అగ్నిలో ॥2॥
ఎండిపోయిన ఎముకలను జీవింపచేయుము నీ ఆత్మతో
శరీర క్రియలను నసింపజేసే దహించు ఆత్మతో నింపయ
||అభిషేకించయా||

ఆత్మ కలిగిన పరిచర్య చేయు జ్ఞానము మాకిమ్మయా
మహిమ కలిగిన కార్యములు సంఘమందు జరిగించయా ॥2॥
మాలో ఉన్న కృపావరములు ప్రజ్వలింప చేయుమయా
నిత్యము మండే బలిపీఠముగా అగ్ని మాలో రగిలించయా
||అభిషేకించయా||

Youtube Video

More Songs

Dheenula Edala Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top