మనోవిచారము కూడదు నీకు | Mano Vichaaramu Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs | M Devadas Ayyagaru
Table of Contents
Mano Vichaaramu Song Lyrics
మనో విచారము కూడదు నీకు – మహిమ తలంపులె కావలెను = దిన క్రమాన శాంతి గుణంబులు – దీనులకిచ్చు చుందును
|| మనో ||
ఆలస్యమైనంత మాత్రమున – అవి నెరవేర వనవద్దు = కాలము పరిపూర్ణంబు కాగా – ఖచ్చితముగ – అన్నియు నెరవేరును
|| మనో ||
నిత్యానందము సత్యానందము – నీలో నే నమర్చితి = అత్యానందము అగపడు చుండును – ఆలోచించు చున్న కొలది
|| మనో ||
కోరవు నీకు కావలసినవి – ఊరకనె నీకిచ్చెదను = ధారళముగ నిచ్చుటకు నా ధన నిధి – వస్తువు లన్నియు గలవు
|| మనో ||
నీరస పడకుము నీరస పడకుము – నీవె నా ఆస్తి గదా = నా రక్తముతో సంపాదించితి – నన్ను నీ ఆస్తిగ గైకొనుము
|| మనో ||
ఆనంద తైలముతో నిన్ను – అభిషేకించి యున్నాను = స్నానము ప్రభు భోజనము ప్రజలకు – జరుపుట సరియని అనుచున్నాను
|| మనో ||
నీకు కావలసినవి అడుగుము – నేను తప్పక ఇచ్చెదను = నీకు ఇచ్చుట నాకానందము – నీవు అడుగుట ముచ్చట నాకు
|| మనో ||
Youtube Video

Song Credits

More Songs

Pingback: Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu - Ambassador Of Christ