ఘన పర్చుడీ దేవుని | Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Telugu Kraisthava keerthanalu | M Devadas Ayyagaru

Table of Contents
Ghana Parchudi Devuni Song Lyrics
ఘన పర్చుడీ దేవుని – త్రైక – జనకుడౌ యేకాత్ముని = మన యొద్ద నివసించు – మనసున్న తండ్రిని – మనసున ఘనపర్చుడీ – బాహ్యమున గూడ ఘన పర్చుడీ
|| ఘన ||
మన తండ్రిగా నుండను – మనలను తన బిడ్డలుగ జేర్పను = తన పుత్రుని ద్వారా – మును బాప్తిస్మాచార – మును నేర్పరచి యుండెను – తండ్రి = చనువ ను గ్రహించెను
|| ఘన ||
బహిరంగ సంఘమునకు – పరిశుద్ధ – బాప్తిస్మమే ద్వారము = ఇహలోక మందున్న – ఈ మార్గమున్ మహా – మహిమగ భావించుడి – దైవ – సహవాసమున్ గాంచుడి
|| ఘన ||
పై యాచారముల వలన – దైవ – భక్తి యభ్యాసమౌను – ఆ యభ్యా సముచేత – అంతరంగ సభకై యాయత్త పడుదము – అప్పుడు – శ్రేష్టమౌ స్థితి గల్గును
|| ఘన ||
క్రీస్తు నామము దాల్తుము – స్నాన – క్రియ జరుగు సమయంబున క్రీస్తు నామము లేని క్రియలన్ని వ్యర్ధంబు – వాస్తవమే ప్రభునకు – జన్మ – వారసుల మౌదుము
|| ఘన ||
స్నాన మాత్మీయ జీవి – తమునకు జన్మస్థితి వంటిది = నా నాట నీ జీవ – నము వృద్ధి నొందును – స్నానేత రాచారముల్ – క్రమ ముగ జరుపుచున్న యెడలను
|| ఘన ||
పరలోక పరిశుద్ధులు – ఈ నరలోక పరిశుద్ధులు = పరమార్ధ విషయాల – బంధు వర్గమౌట – పరిశుద్ధ బాప్తిస్మమే – మొదటి – ప్రాముఖ్య సాధనము
|| ఘన ||
Song Credits

More Songs
Jayamu Keerthanalu Song Lyrics || Bible mission Songs || Old Is Gold
