నా ఆశలన్నీ తీర్చువాడా | Naa Ashalanni Thirchuvada Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Bro John J

Table of Contents
Naa Ashalanni Thirchuvada Song Lyrics
నా ఆశలన్నీ తీర్చువాడా
నిన్నే నే నమ్మితినయ్య (2)
నాకున్న ఆధారం నీవెనయ్య
నా క్షేమమంతయు నీలోనయ్య (2)
ఏదైన నీ వల్లె జరుగునయ్య (2)
|| నా ఆశలన్నీ ||
ఊహించలేదు నేనెప్పుడు
నేనంటే నీకు ఇంత ప్రేమనీ (2)
పగిలిపోయిన నా హృదయమును (2)
నీ గాయాల చేతితో బాగుచేసావే (2)
|| నా ఆశలన్నీ ||
ఇక ఈ బ్రతుకు ఐపోయిందని
నిర్థారించిన వారు ఎందరో (2)
విసిగిపోయిన నా ప్రాణమును (2)
ప్రతి రోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే (2)
|| నా ఆశలన్నీ ||
ఆశించితి నేను నీ చెలిమిని
కడవరకు నీతోనే బ్రతకాలని (2)
మిగిలిపోయిన ఈ అధముడను (2)
నీ సేవచేసే భాగ్యమిచ్చావే (2)
నా ఆశలన్నీ తీర్చువాడా
నిన్నే నే నమ్మితినయ్య (2)
నాకున్న ఆధారం నీవెనయ్య
నా క్షేమమంతయు నీలోనయ్య (2)
ఏదైన నీ వల్లె జరుగునయ్య (2)
Youtube Video

More Songs
Neelanti Daivam Song Lyrics | Raj Praksh Paul | Latest Telugu Christian Songs 2024 | Worship Song

Pingback: Ninnu Mathrame Ne Nammanaya Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Bro John J - Ambassador Of Christ