నా హృదయాన కొలువైన యేసయ్యా | Naa Hrudayana Koluvaina Song Lyrics | Latest Hosanna Ministries Songs 2026 | Bro.YESANNA Garu

Table of Contents
Naa Hrudayana Koluvaina Song Lyrics
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2)
||నా హృదయాన||
అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2)
||నా హృదయాన||
అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2)
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2)
||నా హృదయాన||
విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2)
సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2)
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును (2)
||నా హృదయాన||
Youtube Video

More Songs
Raja Jagamerigina Raju Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song Bro.YESANNA garu
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
