Naakintha Protsaha Song Lyrics | Srastha | Bible Mission Songs | Old Is Gold | Devadas Ayyagaru
Table of Contents
Naakintha Protsaha Song Lyrics Telugu
నాకింత ప్రోత్సాహా – నందంబుల్ గల్గుట – కే కర్త ఘన మైన – హేతువై యుండు = నాకు గల యున్నత కారణమే నాధుడగును నేను మురియు – శ్రీ కరంబగు నామమేది – సిల్వబడ్డ యేసుక్రీస్తే
|| నాకింత ||
ఎవరు నా భక్తికి – హితమైనట్టి పునాది – ఎవరు నా కంఠంబు – నెత్తెన్ పాటలతో = ఎవరు నా పాపముల భారము – నెత్తుకొని – దేవునికి నాకును – చివరకున్ స్నేహంబు కల్పిరి – సిల్వబడ్డ యేసుక్రీస్తే
|| నాకింత ||
నేను నా విధులెల్ల – నిశ్చయంబుగ నెరుగ – జ్ఞానమిచ్చుచు నుండు జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యదార్ధ – పరునిగా గా – వించి యవి నా – చే నెరవేర్పించు నెవరు – సిల్వబడ్డ యేసు క్రీస్తే
|| నాకింత ||
ఎవరు నా శత్రువు – నెదిరించి గెల్చిరి – ఎవరు నా శోకంబు – నెగురగొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్చను – నీడ్చి సేద దీర్చి మనసు – చివుకు మను గాయంబు మాన్పిరి – సిల్వబడ్డ యేసుక్రీస్తే
|| నాకింత ||
మరణంబులో నాకు – చిర జీవ మెవ్వారు – మరణంబునకై గొప్ప – మరణ మెవ్వారు = విరివి లేని మహిమ సేనలు – దరిని నుండగ – నన్ను చెంతను స్థిరముగ స్థాపించు నెవరు – సిల్వబడ్డ యేసుక్రీస్తే
|| నాకింత ||
నన్ను రక్షింప మర – ణం బొందియు సమాధి – నెన్నటికిని – గెల్చి యున్న ప్రభునందు = నున్న విశ్వాసంబె నాకు – నుత్సవంబును – గలుగ జేయును – చెన్నగు నా ప్రభువు వింకెవ్వరు – సిల్వబడ్డ యేసుక్రీస్తే
|| నాకింత ||
Youtube Video
More Songs
Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru