నడిపిస్తాడు నా దేవుడు | Nadipisthadu Naa Devudu Song Lyrics | Latest Telugu Christian Song | Bro A R Stevanson
Table of Contents
Nadipisthadu Naa Devudu Song Lyrics
నడిపిస్తాడు నా దేవుడు –
శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా –
అలసట పైబడినా (2)
చేయి పట్టి వెన్నుతట్టి –
చక్కని ఆలొచన చెప్పి (2)
||నడిపిస్తాడు||
అంధకారమే దారి మూసినా –
నిందలే నను కృంగదీసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)
||నడిపిస్తాడు||
కష్టాల కొలిమి కాల్చివేసినా –
శోకాలు గుండెను చీల్చివేసినా (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)
||నడిపిస్తాడు||
నాకున్న కలిమి కరిగిపోయిన –
నాకున్న బలిమి తరిగిపోయిన (2)
తన చిత్తం నెరవేర్చుతాడు
గమ్యం వరకు నను చేర్చుతాడు (2)
||నడిపిస్తాడు||
నడిపిస్తాడు నా దేవుడు –
శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా –
అలసట పైబడినా (2)
చేయి పట్టి వెన్నుతట్టి –
చక్కని ఆలొచన చెప్పి (2)
||నడిపిస్తాడు||
Pingback: Nuvve Lekapothe Nenu Jeevinchalenu Song Lyrics | New Telugu Song 2024 | Robert Stoll | Raj Prakash Paul | Jessy Paul - Ambassador Of Christ