నజరేతువాడా – నా ప్రాణప్రియుడా | Najarethuvada Naa Pranapriyuda Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Najarethuvada Naa Pranapriyuda Song Lyrics
పల్లవి :
నజరేతువాడా – నా ప్రాణప్రియుడా
సద్గుణ సంపన్న శీలుడా
నజరేతువాడా – నా ప్రాణప్రియుడా
పరమందు ఆసీనుడై వున్నా వాడ
అ.ప :
నీకే వందనం – నీకే వందనం –
స్తుతి స్తోత్రం నీకే చెల్లున్నయ్యా
చ :
పాపపు ఊబిలో పడివుండగా – లేవ నెత్తి బండపై నిలిపావు
నా అడుగులు స్థిరపరచి – నీ ప్రియ బిడ్డగా చేసుకున్నావు.
( నీకే వందనం )
చ :
అపవాది వలలో నే చిక్కియుండగా – లాగి కౌగిట దాచినావు
ఏ అర్హతలేని నన్ను – నీ సొత్తుగా చేసుకున్నావు
( నీకే వందనం )
చ :
ఊహకందని మేలులు చేసావు – నీ రక్షణ నాకు ఇచ్చావు
పరిశుద్ధునిగా నను చేసి – పరలోకం నాకుందన్నావు
( నీకే వందనం )
నజరేతువాడా – నా ప్రాణప్రియుడా
సద్గుణ సంపన్న శీలుడా
నజరేతువాడా – నా ప్రాణప్రియుడా
పరమందు ఆసీనుడై వున్నా వాడ
Youtube Video

More Songs
Manninche Prema Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2025
