Nannu Viduvaka Song Lyrics | New Year Song 2025 | Bro Saahus prince | Calvary Temple

నన్ను విడువక | Nannu Viduvaka Song Lyrics | New Year Song 2025 | Bro Saahus prince | Calvary Temple

Nannu Viduvaka Song Lyrics

Nannu Viduvaka Song Lyrics

పల్లవి:
నను విడువక – నాతో వస్తున్నా
నను మరువక – నను దీవిస్తానన్నా

అ.ప:
యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ
హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా

చరణం:
ప్రతి పనిలో తోడుండి – ప్రతిఫలమే ఇస్తాడన్నా
ప్రతి దినము ప్రతి క్షణము – ప్రాణంగా పోషిస్తాడన్నా
నీడైనా వీడినను – నావెంటే వుంటాడన్నా
చేతుల్లో చెక్కుకుని – నిత్యము నను గమనించే
యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ
హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా

చరణం:
అడ్డులనే తొలగించి – అద్దరికే చేరుస్తాడన్నా
ఆదరణే కరువైన – ఆప్యాయత కురుపిస్తాడన్నా
కడవరకు తన కృపతో – నను కాచి కాపాడునన్నా
శత్రువులే లేచినను – నా పక్షముగా పోరాడే
యేసయ్య నాతో ఉండగా – ఈ వత్సరమే ఓ .. పండగ
హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా – హల్లేలూయా

నను విడువక – నాతో వస్తున్నా
నను మరువక – నను దీవిస్తానన్నా

Youtube Video

More Songs

Adharinchumayya Song Lyrics | Suhaas Prince | Calvary Temple Latest Telugu Christian Song 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top