నే సిద్ధపడి | మరనాత | Ne Siddapadi Diddukoni Song Lyrics | Latest Christian Devotional song 2025 | sirivella Hanok |

Table of Contents
Ne Siddapadi Diddukoni Song Lyrics
నే సిద్ధపడి దిద్దుకొని చాటెదను సువార్త
నే కడుగబడి నిలువబడి చాటెదను ప్రేమవార్త (2)
నే పాడెదను మరనాత – నే చాటెదను మరనాత (2)
మరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య వచ్చుచున్నాడు
మరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య త్వరగా రమ్ము (2)
ప్రభు రాకడ వచ్చుచున్నది (2)
( నే సిద్ధపడి )
దైవ సన్నిదనే చట్రంలో – దైవ వాక్య మనే చట్టంలో (2)
క్రమముగ నే మలచబడి – పరిశుద్ధముగ తీర్చబడి (2)
ప్రభువు రాకకై సిద్ధపడెదన్ (2)
( నే సిద్ధపడి )
తీర్పు ఉందనే భీతితో – దేవుడు కోరిన రీతిలో (2)
క్రమముగ నే నడుచుకొని – పరిపూర్ణతను పొందుకొని (2)
ప్రభువు రాకకై సిద్ధపడెదన్ (2)
నే సిద్ధపడి దిద్దుకొని చాటెదను సువార్త
నే కడుగబడి నిలువబడి చాటెదను ప్రేమవార్త (2)
నే పాడెదను మరనాత – నే చాటెదను మరనాత (2)
మరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య వచ్చుచున్నాడు
మరనాత ఆ ఆ ఆ.. – యేసయ్య త్వరగా రమ్ము (2)
ప్రభు రాకడ వచ్చుచున్నది (2)
Youtube Video

More Songs
