నీ సేవలో నన్ను తరియించనీ | Nee Sevalo Song Lyrics | Joshua Shaik | Latest New Telugu Christian Songs 2025 | Pranam Kamlakhar | Srisha
Table of Contents
Nee Sevalo Song Lyrics
నీ సేవలో నన్ను తరియించనీ
నీ ప్రేమలో నన్ను జీవించనీ
ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి
కొనియాడెదా
నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి
స్తుతిపాడెదా
యేసు నీలో నే సాగెదా
జీవితాన సోలిపోయా – చేరదీసి దయచూపవా
హోరుగాలి సాగరాన – చేయి చాపి దరిచేర్చవా
వేచివున్నా నే ఆశతో – బలము నింపు నీ ఆత్మతో
ఏకమై నా తోడుగా – భయము లేదు నీవుండగా
ఎదలో భారం మోసినావు – ఎంత ప్రేమ నా యేసయ్య
ఈ జగాన నీడ నీవై – కాచినావే కరుణాత్ముడా
ఎన్నడైనా వీడలేదే – మార్పులేని మహనీయుడా
చేరదీసే నీ స్నేహము – ఎదురుచూసే నా కోసము
నీ కృపా నా క్షేమము – మధురమైన సంకల్పము
నడిపే నన్ను నీదు కాంతి – ఎల్లవేళ నా యేసయ్య
నీ సేవలో నన్ను తరియించనీ
నీ ప్రేమలో నన్ను జీవించనీ
ఆధారమా అనురాగమా నిన్నే స్తుతించి
కొనియాడెదా
నా జీవమా జయగీతమా నిన్నే స్మరించి
స్తుతిపాడెదా
యేసు నీలో నే సాగెదా
Youtube Video
More Songs
Manninche Prema Song Lyrics | Joshua Shaik | Latest Telugu Christian Songs 2025