Ni Prema Pandhirilo Song Lyrics | Saswathamainadi Nee Prema Naa Song Lyrics | New Year Song 2025

శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల | నీ ప్రేమ పందిరిలో | Ni Prema Pandhirilo Song Lyrics | New Year Song 2025 | Pastor Sagar

Ni Prema Pandhirilo Song Lyrics

Ni Prema Pandhirilo Song Lyrics

పల్లవి:
శాశ్వతమైనది నీ ప్రేమ నా యెడల
విడదీయ లేనిది నీ స్నేహ బంధము
నీ ప్రేమ పందిరిలో ఫలియింపజేసితివే
నీ దివ్య సన్నిధిలో ఎనలేని సంతోషమే
నీవే తోడుండగా-ప్రతి విజయం నా సొంతమే
నీవే దీవించగా మార్చ తరమా ఏదైనాను(మార్చగలరా ఎవరైనాను)

చరణం:
వర్ణన కందని నీ ప్రేమ ఓదార్చినయ్య వేదనలో
లోక ప్రేమలు నీదు ప్రేమకు సాటి రావుగా
స్వార్థం అయ్యా ఈ లోకమే-దాటి వెళ్ళకు నన్ను ఎన్నడు
చాలునయ్యా నీ కృప నాకు-నన్ను నడుపుము నీ దయతో
నీవే నాకుండగా-ప్రతిక్షణం పరవశమే
నీవే దర్శించగా-ధన్యమయ్య నా జీవితం
|| శాశ్వతమైనది ||

చరణం:
కలవరముందిన వేళల్లో నీవున్నతమైన వాక్యముతో
తలను వంచని తెగువ నాలో కలుగజేసినావు
మేలుకొరకే శోధనలన్నీ-అనుమతించిన నా తండ్రివే
ఘనత కొరకే గాయములన్నీ-అనుభవింపగా తలచితివే
నీవే నడిపించగా-ప్రతిదినము ఆనందమే
నీవే కరుణించగా-కలతలైన కమనీయమే
|| శాశ్వతమైనది ||

చరణం:
ప్రాకారముగా కాచితివే ప్రతిచోట సాక్షిగా నిలిపితివే
ఎన్నడెరుగని విజయబాటలో నన్ను నడిపితివే
నీ సువార్తనే నా ప్రాణముగా-ఎంచుకొనుటే నా భాగ్యము
నీదు సేవలో అంతము వరకు-తేజరిల్లుటే నా ధ్యేయము
నిన్నే సేవింతును-నీ కృపలో హర్షింతును
నిన్నే ఘనపరుతును-నీ మహిమకై జీవింతును
|| శాశ్వతమైనది ||

Youtube Video

More Songs

Ghanudavu Neve Parishuddudavu Song | Pastor Sagar | Latest Telugu Christian Songs 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top