నిత్యుడ నీ నామమును | Nithyuda Nee Naamamunu Song Lyrics | KY Ratnam | Sireesha Baghavathula | Latest Telugu Christian Song 2024

Table of Contents
Nithyuda Nee Naamamunu Song Lyrics
నిత్యుడ నీ నామమును
నిత్యమగు నీ ప్రేమను
నిత్యూడ నీ సన్నిధిలో
నిత్యము స్తుతీయించెదను “2”
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును “4”
|| నిత్యుడ ||
నీ నామమెంతో బలమైనది
ఉన్నతమైనదిగా హెచ్చించబడినది “2”
నీ నామమే నెమ్మదినిచ్చును
నీ నామమే దీవెనలనిచ్చును “2”
నీ నామమే నా గానమై నా యేసయ్య
నిత్యము నీ నామమునే స్తుతియించెద “2”
|| స్తుతి ||
నీ ప్రేమయే శాశ్వతమైనది
ధన రాశులలో వెల కట్టలేనిది “2”
నీ ప్రేమయే పరిశుద్ధమైనది
నీ ప్రేమయే పరిపూర్ణమైనది “2”
నీ ప్రేమకు సాక్షిగా ఇల జీవించేద
ఇలలోన నీ ప్రేమలో తరియించేద “2”
|| స్తుతి ||
నీ సన్నిధిలోనే సమాధానము
శత్రువును జయించే ఆశ్రయ దుర్గము”2″
నీ సన్నిధిలో కాపాడబడుదుము
నీ సన్నిధిలో వెలిగింపబడుదుము “2”
నీ సన్నిధి వాక్యమని జీవించెద
నిత్యము నీ సన్నిధిని అనుభవించెద “2”
|| స్తుతి ||
Youtube Video

More Songs
