Ontarini Kaanennadu Song Lyrics | Bro Mathews | Latest Krupa Ministries Songs 2026
Table of Contents
Ontarini Kaanennadu Song Lyrics
ఒంటరిని కానెన్నడు నాతోడు నీవుండగా
ఓడిపోను నేనెన్నడు నా పక్షము నీవుండగా (2)
సైన్యములకు అధిపతివి నీవే యేసయ్యా
నా విజయ సారధివి నీవే మహారాజా
నా శోభాతి శయమును కోరితివయ్యా (2)
(ఒంటరిని)
నరుల ఎదుట నిన్నాశ్రయించితిని
నా శ్రమకాలమున నన్ను వీడకుంటివి (2)
ఇరుకులో విశాలతను కలుగజేసితివి (2)
నా అంగలార్పును నాట్యముగా చేసితివి (2)
(ఒంటరిని)
శత్రువు యుక్తితో బంధింప చూడగా
బలమైన బాహువుతో నన్ను ఆదుకుంటివి (2)
నీ ఆశ్రయపురములో నన్ను చేర్చుకుంటివి (2)
నా అరణ్య రోదనంతా ఉల్లాసమాయెను (2)
(ఒంటరిని)
నీ స్వాస్థ్యపు ప్రజలకై ముందుండి నడచితివి
విర్రవీగు నియంతలను అధములుగ చేసితివి (2)
మారని దేవుడవై నా తోనే నిలిచితివి (2)
ఘన కీర్తనలతో ఘనపరతును యేసయ్యా (2)
(ఒంటరిని)
Youtube Video
More Songs
Gathakalamu Nee Krupalo Song Lyrics | Latest New Year Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
join our whatsApp Channel to Participate in telugu Bible quiz and win spiritual gifts and Prizes