రవితేజుడా రమనీయుడా రాజిల్లువాడా | Ravi Tejuda Ramaniyuda Song Lyrics | Krupa Ministries | Sankshemanadhuda Naa Yesayya | Bro Mathews | Latest Telugu Christian Song 2025

Table of Contents
Ravi Tejuda Ramaniyuda Song Lyrics
రవితేజుడా రమనీయుడా రాజిల్లువాడా
సుందరుడా గుణశీలుడా నా యేసురాజా (2)
ఈ లోకాన సాటి నీకు ఎవ్వరయ్యా
నీతోడుంటే చాలు నాకు యేసయ్య (2)
అను నిత్యము నిన్నే స్తుతింతునయ్యా
అనురాగము పంచే నా యేసయ్య. (2)
||రవి తేజుడా||
1) అవహేళనలే నను వేదించగా
అనుక్షణము అవి నన్నే వెంటాడగా
అనునయించి నా అక్కున చేరితివి
అవమానలనే దీవెనలుగా చేసితివి
||అను నిత్యము||
2) విడువక నాయెడల కృప చూపితివి
నీ పర్ణశాలలో నను దాచితివి
క్షోభిల్లిన నా హృదయం సంతసించగా
శోభాతిశయముగా నను మార్చితివి
||అను నిత్యము||
3) ఆశ్చర్యకార్యములే చేసితివి
దయగల నీ ఆత్మతో నను నడిపించుము
రాజువైన దేవా నిను ఘనపరతును
నీ నామము నిత్యము సన్నుతింతును
||అను నిత్యము||
Youtube Video

More Songs
Sthotragaanamu Neeke Song Lyrics | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025
