స్తోత్ర గానము నీకే యేసయ్యా | Sthotragaanamu Neeke Song Lyrics | Sankshemanadhuda | Krupa Ministries | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Sthotragaanamu Neeke Song Lyrics
స్తోత్ర గానము నీకే యేసయ్యా
క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు(2)
సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు
సరిలేరయ్యా నీకు ఏ దైవము(2)
స్తుతి నైవేద్యంతో నిను పూజింతును
ఉత్సాహ ధ్వనులతో నిను ఆరాధింతును(2)
( స్తుతి నైవేద్యముతో )
గిరులన్నిటిలో ఎంత వెదకినను
అమరులు లేరు నీ వంటి వారు(2)
వేల్పులలో బహుఘనుడవు నీవయ్యా(2)
ఇహపరమందు నీవే పూజార్హుడవు(2)
( స్తుతి నైవేద్యముతో )
మేఘాలలో నీటి నిధులను దాచి
భూమిని సిరులతో దీవించితివి(2)
జనులందరికీ పోషణ నీవయ్యా(2)
నీతో పోల్చదగిన దేవుడు లేడయ్యా(2)
( స్తుతి నైవేద్యముతో )
అమరుడవు నీవు అదృశ్య దేవుడవు
దాసుని రూపమును ధరియించితివి(2)
రిక్తునిగా సిలువను మోసితివి(2)
నీ త్యాగనిరతిని కొనియాడెదయేసయ్య(2)
స్తోత్ర గానము నీకే యేసయ్యా
క్షేత్రములన్నిటిలో మించిన దేవుడవు(2)
సాటిరారు ప్రఖ్యాతులెవ్వరు
సరిలేరయ్యా నీకు ఏ దైవము(2)
స్తుతి నైవేద్యంతో నిను పూజింతును
ఉత్సాహ ధ్వనులతో నిను ఆరాధింతును(2)
Youtube Video

More Songs
Viswavikyathuda Song Lyrics | Kshema Kshethrama Song Lyrics | 2025 New Year Song | Krupa Ministries
