Sambaralu Modalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024

🎵 Worship Mode

సంబరాలు మొదలాయే | ఇమ్మానుయేలు దేవుడు | Sambaralu Modalaye Song Lyrics | Latest Telugu Christmas Song 2024

Sambaralu Modalaye Song Lyrics

Sambaralu Modalaye Song Lyrics

ఇమ్మానుయేలు దేవుడు
పరమును వీడి వచ్చాడు
నరునిగా మనకై పుట్టాడు
నిరతము మనతోడుంటాడు..

సంబరాలు మొదలాయే
మన ఊరంతా ఈ రోజుతో..
నింగినేలా ఒకటాయే
మన యేసయ్య రాకతో..

లోకమునే ప్రేమించి
తండ్రి చిత్తము చేసి
సింహాసనమే వదిలి దిగి వచ్చాడే!
పాపమునే తొలగించి
శాపమునే విడిపించి
పరిశుద్ధుడిగా ఇలలో జన్మించాడే!

నశియించే వారిని రక్షింపగా వచ్చాడే!
పరలోక మార్గమై లోకాన పుట్టాడే!
దేవాధి దేవుడే మానవుడై వెలిశాడే!..

రాజులకు రాజైన
ప్రభువులకు ప్రభువైన
దీనుడిగా భువిపైన ఉదయించాడే
సర్వమునే పాలించే
నరకమునే తప్పించే
దైవకుమారుడిగా మనకై అరుదేంచాడే

మనమంటే ఎంత ప్రేమో మనకై మరణించాడే
మన తండ్రి చెంతకే మననే చేరుస్తాడే
రానున్న రారాజై అతిత్వరలో వస్తాడే..

ఇమ్మానుయేలు దేవుడు
పరమును వీడి వచ్చాడు
నరునిగా మనకై పుట్టాడు
నిరతము మనతోడుంటాడు..

Youtube Video

More Songs

Chukka Puttindhi Song Lyrics – Christmas Folk Song | Latest New Telugu Christmas Song 2018

📖 Quick Bible Quiz

Score: 0 / 3

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top