వెలసెనులే గగనాన తూర్పుతార | Velasenule christmas Song Lyrics || LATEST TELUGU CHRISTMAS SONG 2023 || Sharon Sisters || JK Christopher
Table of Contents
Velasenule christmas Song Lyrics Telugu
వెలసెనులే గగనాన తూర్పుతార – నిశీధిరేయి జాములో
కురిసెనులే జగాన ప్రేమధార – రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే – ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే – దీనులు ధన్యులాయెనే
“శుభవార్త దూతదెల్పగ – ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే – పరలోకానా సంగీతమాయెనే “
తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు –
తీరాలు దాటి నిను చూడగా
బంగారు సాంబ్రాణి బోళములర్పించి –
నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని
జగాలనేలే జయశీలుడేసే –
జీవాధిపతిగా జనియించెనే
శరీరధారై పరిశుద్ధుడేసే –
పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి – కీర్తించి కొనియాడెదము
మా పాపభారం భరియించెనే –
మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే
మన్నించి మమ్ము క్షమియించెనే –
కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై -మా మదిలో ఉదయించెనే
Song Credits
Keys & Rhythm Programming – JK CHRISTOPHER
Tune – LILLIAN CHRISTOPHER
Lyrics – SUNIL THURIMELLA
Lead Vocals – SHARON PHILIP, LILLIAN CHRISTOPHER, HANA JOYCE
Children Chorus – PRINCE, MELODY, RON, CANDY & JADEN
Guitars – JOEL SHASTRY
Pingback: Vachesindi krottha vathsaram Song Lyrics || New year song 2023 || #JKChristopher #Pandupremkumar #Sharon sisters - Ambassador Of Christ
Pingback: MahaRaaju Thara Tharaala Cheekatini Song Lyrics | Latest New Christmas Song 2024-25 | Pas.David Varma - Ambassador Of Christ