ఏ పాటి అర్హత లేని నన్నెంచుకున్నావు | Yemivvagalanu Aa Thyagaanikai Song Lyrics | Latest Telugu Good Friday Songs 2025

Table of Contents
Yemivvagalanu Aa Thyagaanikai Song Lyrics
ఏ పాటి అర్హత లేని నన్నెంచుకున్నావు నీవు
ఏ మాత్రమూ పాత్రుడ కానీ నన్నాదరించావు నీవు
నా దోషములకై నీ రుధిరమునే యాగముగా చేసినావు
ఈ పాపి కొరకై నీ ప్రాణమునే బలిగా అర్పించినావు
వర్ణించలేనయ్యా నీ జాలినీ
వివరించలేనయ్యా నీ కరుణను
నీ గాయాలను మరి రేపినా
చేదు చిరకను త్రాగనిచ్చినా
నిన్నెంతగానో భాదించినా
నా తలంపులతో నిను శిలువ వేసినా
కౌగలించావు నా తోడుగ ఉన్నావు
నను చేరదీసి నను చేర్చుకున్నావు-2
ఏమివ్వగలను ఆ త్యాగానికై
నాకెవరివ్వగలరయ్యా నీ ప్రేమను-2
||ఏ పాటి||
వధకు తేబడిన గొఱ్ఱె పిల్లవై
మౌనముగా నున్నది నా కొరకే కదా
మరణ పాత్రుడనైయున్న నాకై
మరణపు ముల్లును విరచిన దేవా
నీ చేయి చాచావు నను లేవనెత్తావు
నను దాసుని కాక వారసుని చేసావు
ఏమివ్వగలను ఆ త్యాగానికై
నాకెవరివ్వగలరయ్యా నీ ప్రేమను-2
||ఏ పాటి||
Youtube Video

More Songs
