స్తుతియు మహిమయు | Sthuthiyu Mahimayu Neeke Song Lyrics | Andhra Kraisthava Keerthanalu | M Devadas Ayyagaru | Bible Mission Songs
Table of Contents
Sthuthiyu Mahimayu Neeke Song Lyrics
స్తుతియు మహిమయు నీకే – క్షితికిన్ దివికిన్ నీటి – వితతికిన్ కర్తవై – వెలయు మా దేవ = ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు – హితుడా మా ప్రేమ నీ – కెట్లు చూపుదును
|| స్తుతియు ||
పసిడి వర్ణంపుటెండ – భాగ్య ధారల వాన – విసరు మంచి గాలి – విరియు పుష్పములు = రసమొల్కు పండ్లు నీ – రమ్య ప్రేమన్ చాటున్ – ప్రసరించు కోతలో – ఫల నొందు వీవు
|| స్తుతియు ||
నెమ్మది గల యిండ్లు – నిజ సౌఖ్య కాలములు – ఇమ్మహి ఫలియించు – నైశ్వర్యాధికముల్ = ఇమ్ముగ గలిగిన – హృదయులమై వంద – నమ్ములు ఋణపడి – యున్నాము నీకు
|| స్తుతియు ||
దురితంబు లొనరించి – దౌర్భాగ్య స్థితి నున్న – ధరణికిన్ నీ పుత్రున్ ధర్మంబు జేసి = నరుల కీ ధర్మమున – కొరత దీర్చెడు సర్వ – వరములమర్చిన – పరమోపకారి
|| స్తుతియు ||
జీవంబు ప్రేమను – జీవను గల్గించెడు – పావనాత్మను మాకై పంపితివి – దీవెనలేడు రె – ట్లావరింపను మమ్ము – నీ విమలాత్మన్ మాలో గుమ్మరించు
|| స్తుతియు ||
నరులకు విమోచ – నము గల్గె పాపంబుల్ – పరిహార మాయె గృ – పా సాధనములు = దొరికె మోక్షాంశంబు – స్థిరమాయె – మేము నీ కొరకేమి తేగలము పరిపూర్ణ జనక!
|| స్తుతియు ||
మాకై వాడుకొనెడి – రూకల్ వ్యర్ధంబగును – నీకై యప్పుగ నిచ్చు నిఖిల వస్తువులు = శ్రీకరంబగు నిత్య శ్రేష్ట ధన నిధియై పై – లోకంబు నందుండు – లోపంబు లేక
|| స్తుతియు ||
జీవంబు వస్తువులు – శ్రేయస్సు దాన స్వ – భావంబు శక్తియు – భాగ్యంబులు = నీ వలననే లభ్య – మై వెలయు చున్నవి – నీ వాసమే మాకు – నిత్యానందంబు
|| స్తుతియు ||