దున్నని బీడు భూములలో | Dunnani Beedu Bhoomulalo Song Lyrics | Bro Sunny Raj Kodavati | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Dunnani Beedu Bhoomulalo Song Lyrics
పల్లవి :
నడిపించు నా దేవా – జరిగించు నీ సేవ
చూపించు ఓ త్రోవ – పయనానికి ఓ ప్రభువా (2)
దున్నని బీడు భూములలో – ఎవ్వరూ పోని స్థలములలో
రక్షణ లేని మనుష్యులలో – మారుమూల పల్లెలలో (2)
చరణం:
ఎవరో వేసిన పంటను కోసే – పరిచర్య వద్దయ్యా
నీ పిలుపును విని పరుగున వచ్చే – ఆత్మలను ఇవ్వయ్య (2)
పరులకు చెందే స్వాస్థ్యము తినే – పురుగుగా వద్దయ్యా
నశించు దానిని వెదకి రక్షించే – భారమును ఇవ్వయ్యా (2)
||దున్నని||
చరణం:
ఎదిగే క్రమములో పిలుపును మరిచే – గుణమే వద్దయ్యా
ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2)
కష్టము లేక సుఖముగా వచ్చే – ఫలమే వద్దయ్యా
కన్నీటితో విత్తి ఆనందంతో కోసే – పంటను ఇవ్వయ్యా (2)
||దున్నని||
చరణం:
ఇతరుల ఆస్తిపై కన్ను వేసే – దొంగను కానయ్యా
స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2)
నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా
మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2)
||దున్నని||
Youtube Video
More Songs
Paricharya Paluvidhamulu Song Lyrics | BRO.P.SUDHAKAR BABU | Latest Christian Songs 2023
Pingback: Yesayya Song Lyrics Enosh Kumar | Ft. Ps. Enosh Kumar V & Ps. Simon Pavan N | Latest New Telugu Christian Song 2024 - Ambassador Of Christ