నిన్నుగొలిచెద రావయ్యా – నా యేసన్నా! | Ninnu Golicheda Ravayya Song Lyrics | Bible mission Songs | Telugu Kristava keerthanalu | Devadas Ayyagarau
Table of Contents
Ninnu Golicheda Ravayya Song Lyrics
నిన్నుగొలిచెద రావయ్యా – నా యేసన్నా! – నిన్ను గొలిచెద రావయ్యా = హృదయ దేవళమందు – ముదమున నిన్ను నిల్పి – భక్తి పుష్పములచే – భజియించి పూజించి
|| నిన్ను ||
పాడుకొందును రావయ్యా – నీ ప్రేమను వేడుకొందును రావయ్యా = అన్న వస్త్రము లేక – అల్లలాడిన నాకు అన్నా నీ వొసగిన అన్న వస్త్రములకై
|| నిన్ను ||
చెప్పు కొందును రావయ్యా – నా పాపంబుల్ ఒప్పుకొందును రావయ్యా = పాప క్షమాపణ – శాప విమోచన పాప బంధితు నాకు – చూపిన ప్రేమకై
|| నిన్ను ||
శుభ్ర పరచితి రావయ్యా – నా హృదయము భద్ర పరచితి రావయ్యా = నీతి సూర్యుడ నీవు ఉదయించునంతనే కుదురౌ – నా ప్రాణము – సదయాత్మ పరమాత్మ
|| నిన్ను ||
దాచుకొందును రావయ్యా – నీ రూపము చూచు కొందును రావయ్యా – దోషాత్ముడను నాదు – దోష మంతయు బాపి – రూప మేర్పరచినా – దాపు నుండిన రాజా!
|| నిన్ను ||
youtube Video
Songs Credits
More Songs
Mano Vichaaramu Song Lyrics | Telugu Christian Songs | Bible Mission Songs