అందమయిన మనసులో రాజుగా నిలవాలని | పెళ్లి కుమారుడు | Pelli Kumarudu Song Lyrics | Ankit Reddi | Sreshta Karmoi | Latest Christian Marriage Songs 2025

Table of Contents
Pelli Kumarudu Song Lyrics
అందమయిన మనసులో రాజుగా నిలవాలని
రాబోయే నా తోడును రాణిగా చూడాలని (2)
వెడుతున్న దేవుడిని తన చిత్తము నెరవేరాలని
అమ్మలా ప్రేమను చూపే రిబ్కా వంటి తోడు కావాలని (2)
|| అందమయిన ||
యోసేపు వంటి నిగ్రహము, దేవుని మాటలే ఆధారము
సాకులు వెతకని సహనము, పరిశుద్దాత్మతో పయనము (2)
కన్నె వధువు సాటిగా నన్ను నేను కాపాడుట కోసము
దేవుడంటే ఉన్న భయము నన్ను కాయుచున్న కవచము (2)
|| అందమయిన ||
ఎస్తేరు వంటి జ్ఞానముతో నాకు బలముగా మారాలి
దెబోరా వంటి ధైర్యముతో శోధనలన్నీ గెలవాలి (2)
దేవుడు ఎవరిని జతగా చేసినా తెలిపెద సమ్మతము
ఆమెలోన చూసేదంతా ఎన్నడూ చెదరని విశ్వాసము (2)
|| అందమయిన ||
కలిమి లెమిలందు ఎల్లప్పుడూ నాకు సాటిగా నడవాలి
నిత్యము దేవుని చిత్తమును విసుగు చెందకుండా కోరాలి (2)
సాటి అయినా తోడుగా నిలిచి హెచ్చరికలను చేయాలి
సంఘమందు సాటి వారికి క్రీస్తులో సోదరి కావాలి (2)
|| అందమయిన ||
Youtube Video

More Songs
