అక్షయుడా | Akshayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-4

Table of Contents
Akshayuda Naa Yesayya Song Lyrics
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం (2)
నీవు నాకోసమే తిరిగి వస్తావని
నేను నీ సొంతమై కలిపోదామని
యుగయుగములు నన్నెలుతావని
నీకే ఘన స్వాగతం
||అక్షయుడా||
నీ బలిపీఠమందు పక్షులకు
వాసమే దొరికేనే
అవి అపురూపమైన నీ దర్శనం
కలిగి జీవించునే
నేనేమందును ఆకాంక్షింతును
నీతో వుండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా
చిరకాల ఆశను నెరవేర్చుతావని
మదిలో చిరు కోరిక
||అక్షయుడా||
నీ అరచేతిలో నను చెక్కుకుని
మరువలేనంటివే
నీ కనుపాపగా నను చూచుకుని
కాచుకున్నావులే
నను రక్షించినా ప్రాణమర్పించినా
నను స్నేహించినా నను ముద్రించినా
నా ప్రీయుడా యేసయ్యా
పానర్పణముగా నా జీవితమును
అర్పించుకున్నానయ్యా
||అక్షయుడా||
నీవు స్థాపించిన ఏ రాజ్యమైనా
కొదువలేకుందునే
మహా విస్తారమైన నీ కృపయే
మేలుతో నింపునే
అది స్థిరమైనది క్షేమమునొందునే
నీ మహిమాత్మతో నెమ్మది పొందునే
నా ప్రియుడా యేసయ్యా
రాజ్యాలనేలే శఖపురుషుడా
నీకు సాటెవ్వరు
||అక్షయుడా||
Youtube Video

More Songs
