ఆశ్రయుడా నా యేసయ్యా | Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna

Table of Contents
Ashrayuda Naa Yesayya Song Lyrics
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమా ప్రభావము నీకేనయ్యా(2)
విశ్వవిజేతవు సత్యవిధాతవు
నిత్య మహిమకు ఆధారము నీవు(2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధన
నీకేనయ్యా స్తుతి ఆరాధన(2)
(ఆశ్రయుడా యేసయ్య)
తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు(2)
కరుణని చూపి కలషము బాపి
నన్ను ప్రేమించిన ప్రేమవు నీవు(2)
జనులకు దైవం జగతికి దీపం నీవు గాక ఎవరున్నారు
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహారాజవు(2)
(ఆశ్రయుడా యేసయ్య)
జీవితదినములు అధికములగునని
వాగ్దానము చేసి దీవించితివి(2)
ఆపత్కాలమున అండగానిలిచి
ఆశల జాడలు చూపించితివి(2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలను బాపి నా స్థితి మార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమ
సాత్వికమే నీ సౌందర్యమా(2)
(ఆశ్రయుడా యేసయ్య)
నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతి అర్పణ(2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యము యొక్క
మహిమైశ్వర్యము నే పొందుటకు (2)
ప్రతి విషయములలో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించేదను
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా(2)
(ఆశ్రయుడా యేసయ్య)
Youtube Video

More Songs
