చూచావు నీవు నా కన్నీటిని | Chuchaavu Neevu Na Kannitini Song Lyrics | George Bush | Latest Christian Song 2025

Table of Contents
Chuchaavu Neevu Na Kannitini Song Lyrics
చూచావు నీవు నా కన్నీటిని
తుడిచావు నీవు నీదు హస్తముతో
చేసావు ఎన్నో కార్యములు నాకై
మరువలేను ఎన్నడు నా యేసయ్య (2)
ఆదరించే ఆత్మీయుడా
కనికరించే నా యేసయ్య
తోడు నీవై నిలిచావయ్య
నీ కంటి పాపగా కాచవయ్య (2)
యేసయ్య నీకే ఆరాధన
యేసయ్య నీకే ఆరాధన
నా యేసయ్య నీకే ఆరాధన
యేసయ్య నీకే ఆరాధన
నా అను వారలకు మారవలె ఉంటిని
దుఃఖము నిట్టూర్పులు నన్ను వెంటాడెను
నా యవ్వన కాలమున గువ్వవలె నేను
ముల్గుచు దుఃఖరావం నే చెయ్యగా (2)
నా సత్ ప్రవర్తన ఎక్కువ చేసి యోగ్యులుగా నిలిపితివి (2)
నన్ను నిందించుటకు ఎన్నో నోళ్ళు లేచెను
వేదన అవమానము నన్ను క్రుంగదిసెను
నా బలమంతయు నన్ను విడిపోయెను
స్వస్థతే ఎన్నడూ నాకు లేకుండెను (2)
నన్ను చేరదీసి ఆదరించి
నన్ను స్వస్థపరిచితివి (2)
నీ వాక్యమందు నాకు పూర్ణశ్రద్ధ నిచ్చితివి
నీ ముఖ దర్శనాభాగ్యం చేయు కృపను ఇచ్చితివి
సుగంధ తైలముతో పరిపూర్ణ సమర్పణతో
నిత్య ఆరాధన చేసే అభిషేకం ఇచ్చితివి
నా జీవితకాలం ఆరాధించి
నిత్యము కొనియాడెదను (2)
Youtube Video

More Songs
Sharonu Rojave Naa Praana Snehame Song Lyrics | Latest Telugu Worship Song 2025
