ఆత్మ స్వరూపుడా నాయేసయ్యా | Aathma Swaroopuda Naa Yesayya Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Table of Contents
Aathma Swaroopuda Naa Yesayya Song Lyrics
ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా నాయేసయ్యా
ఆరాధించెదనిన్నే అద్వితీయుడా
ఆనందించెదనీలో నేఎల్లవేళలా !!
పూర్ణహోమములు – బలులు అర్పణలు
నీకిష్టమైనవి కానేకాదు !
పూర్ణహోమములు – బలులు అర్పణలు
నీవెన్నడు కోరనేలేదు !
నాపాప హృదయాన్ని కోరుకున్నావు
నీశిలువ ప్రేమతో నన్ను చేర్చుకున్నావు !!
ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
కృపగలదేవుడవు – దయగలతండ్రివి
వాత్సల్యపూర్ణుడవయ్యా నీవు !
కృపగలదేవుడవు – దయగలతండ్రివి
ప్రేమాసంపూర్ణుడవయ్యా నీవు !
ఎల్లప్పుడూ నీవు కోపించవు
దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకొన్నావు !!
ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
జగతికి రక్షకుడా – దీనదయాళుడా
వసుదైక దేవుడవయ్యా నీవు !!
జగతికి రక్షకుడా – దీనదయాళుడా
దేవాతి దేవుడవయ్యా నీవు !!
పాపుల రక్షణకొరకై నీవు
పరిశుద్దరక్తాన్ని చిందించావు !!
ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు
నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా !!
Youtube Video

More Songs
Nadipe Naanna Song Lyrics | Sis KanthiKala | LatestTeluguChristian song 2024
