Naa Chelimi Kori Song | Nija Snehithuda Song Lyrics | Hadlee Xavier | Latest Best Christian Songs 2023

నా చెలిమి కోరి – నీ కలిమి వీడి | Naa Chelimi Kori Song | Nija Snehithuda Song Lyrics | Hadlee Xavier | Latest Best Christian Songs 2023

Nija Snehithuda Song Lyrics

Nija Snehithuda Song Lyrics

పల్లవి:
నా చెలిమి కోరి – నీ కలిమి వీడి,
నా చెంత చేరావు శ్రీమంతుడా!
నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది,
బలియాగమైన నిజ స్నేహితుడా! (2)

ద్రోహినై – దూరమైతిని,
పాపినై – పరుగులెడితిని
గమ్యమే – ఎరుగనైతిని
మరణమే – శరణమాయెను.

ఎంతో ప్రేమించితివి – నాస్థానమందు నిలిచితివి,
కృపతో నను రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి.
( నా చెలిమి )

నిందలు – అవమానములు,
హేళనలు – చీత్కారములు
కఠిన దెబ్బలు – ముళ్లపోటులు,
శిలువ భారం – కాయమంతా గాయం

హృదినే బాధించినా – భరించావు వేదన మౌనముగా
తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని.
( నా చెలిమి )

ఏ రీతి నిన్ను – కీర్తించగలను?
నా నీతి నీవే ఓ యేసుదేవా!
నీ సాక్షిగా నిలిచి – నీ ప్రేమను చాటి,
ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా!

నా చెలిమి కోరి – నీ కలిమి వీడి,
నా చెంత చేరావు శ్రీమంతుడా!
నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది,
బలియాగమైన నిజ స్నేహితుడా! (2)

Youtube Video

More Songs

Kantipaapalaa Kaachinaavayaa Song Lyrics | HADLEE XAVIER | KRANTHI CHEPURI | ERUSHA | Latest Telugu Christian Songs 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top