అంటరాని వాడ వంటు నన్ను | Antaraani Vaadavantu Song Lyrics | Latest Telugu Christian Song 2023 | Joel Kodali
Table of Contents
Antaraani Vaadavantu Song Lyrics
అంటరాని వాడ వంటు నన్ను
ఊరు బైటకు త్రోసి వేసిరి
దేహమంతా కుళ్లిపోయి
దుర్వాసనతో నిండి పోయే
ఐన వారు కానరాక
భుజము తట్టే వారు లేక
కంటి నిండా నిదుర పొక
ఒంటరిగా జీవించలేక
మరణమును బ్రతిమాలుకున్నా
మరణమును బ్రతిమాలుకున్నా
అదియు నన్ను ముట్ట లేదు
చావలేక బ్రతుకలేక విసికిపోయాను
నేను అలసిపోయాను
నీ దరికి చేరాను నిన్నే నమ్ముకున్నాను
యేసు యేసు యేసు నా తట్టు తిరగవా
యేసు యేసు యేసు నా గోడు వినవా
నిలిచిపోయావు నా కేక వినగానే
కదలి పోయావు నా స్థితిని చూడగానే
నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి
నేను కరిగిపోయాను
నీ కనికరము చూసి కన్నీటితో తడిసిపోయాను
యేసు యేసు యేసు నీకెంత జాలి
చాలు చాలు చాలు నీ దయయే చాలు
నన్ను తాకావు నీ చేతులను చాపి
కుష్టు రోగము నా దేహము పైన ఉండగానే
నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి
నన్ను ముట్టుకున్నావు
ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను
యేసు యేసు యేసు నీలా ఉందురెవరు
చాలు చాలు చాలు నీ స్పర్శ చాలు
స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు
మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరూ
యేసు యేసు యేసు దండములు నీకు
చాలు చాలు నాకింక నీవే చాలు
Youtube Video
More Songs
Noothana Hrudhayamu Song Lyrics | Joel Kodali | Latest Telugu Christian Song | HADLEE XAVIER