brathakalanna aasha | bahu vinthaina prema song Lyrics || latest Telugu Christian songs 2023 || Ashok.M ||Surya Prakash || sthuthi vedika
Table of Contents
కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును; ఆత్మతో పాడుదును, మనస్సుతోను పాడుదును.
-1 కోరింథీయులకు 14: 15
Bahu Vinthaina Prema Song Lyrics
Telugu Lyrics..
బ్రతకాలన్న ఆశ కలిగించింది నీ ప్రేమే
బ్రతుకంతయు ఆశవు నీవై నడిపించుచున్నది నీ ప్రేమే (2)
యేసయ్యా నా కనులను వెలిగించింది నీ ప్రేమే
దాస్యము నుండి విడిపించి నను దరిచేర్చెను నీ చెంతకే (2)
ప్రేమే నీవై నా కొరకే త్యాగమై
నిలువెల్లా నీవై నిండిపోవా నా హృదిపై
నా జీవనాధారమై నను నడిపే సారధివై
వెలిగించే దీపమై నా బ్రతుకంతా పండుగవై
నీకు దూరమైన నా బ్రతుకు పాపపు చెరకు బలికాగా
బ్రతుకునిస్తావన్న ఆశతో నీ చెంతకు పరుగులు తీయగా (2)
నిను విడిచిన నాకు విందే చేసిన బహు వింతైన నీ ప్రేమ
నేనున్నా నీకు భయమేలనంటూ ఓదార్చిన నీ ప్రేమ (2)
|| ప్రేమే నీవై ||
నా కఠినహృదిని కలిగించిన అతి స్వచ్చమైన నీ ప్రేమ
సంగీతముగా నామదిని మ్రోగింపజేసెను నీ ప్రేమ (2)
పరిశుద్ధమైన వాక్యము ద్వారా పరివర్తన కలిగెను నాలో
చీకటి బ్రతుకుకు తెరదించి నూతన పరిచెను నన్నిలలో (2)
|| ప్రేమే నీవై ||
కలుషపు కొలనులో కలువగా పూసిన నీ మాదిరే అతి మధురం
కమనీయమైన నీ ప్రేమ చరితం మానవాళికే మార్గదర్శకం (2)
నిను వెంబడించుటే పాపికి మోక్షం, నీ మార్గమే జీవము
నిను చేరుకొనుటయే బ్రతుకుకు అర్థం, నీదే ఈ జీవితం (2)
|| ప్రేమే నీవై ||
Youtube Video
Song Credits
lyrics & tune : Br.issac
Music: Ashok.M
singer: Surya Prakash
studio: Tony waves recording studio in Hyderabad
More Songs
దీవించావే సమృద్ధిగా | Deevinchave Samvruddigaa Song Lyrics || Heart Touching1 ||
వన్నెస్ 2 | Oneness 2 Song Lyrics || unity || heart touching