బలహీనతలోన నీవేనా బలమయ్యా | Balaheenthalona Song Lyrics | Hanok Raj | Latest Telugu Christian Songs 2024
Table of Contents
Balaheenthalona Song Lyrics
బలహీనతలోన నీవేనా బలమయ్యా
నా దీనస్థితిలోన నా ధైర్యము నీవయ్యా
కృపామయుడా యేసయ్యా నీ కృపయే నాకు చాలయ్యా
సర్వోన్నతుడా నా దేవా నా సర్వం నీవయ్యా
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
ఒంటరినై నేను దిగులుచెందగా
శోధన వేదన నన్ను చుట్టుముట్టగా
నాకు తోడుగా నీవే నా మార్గదర్శిగా
కృపల వెంబడి కృపలతో నడిపించావుగా
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించితివే
తప్పులెన్నో చేసిన నన్ను మన్నించితివే
నీ దరికి చేర్చుకొని ఆదరించినావే
నీ కృపలెన్నో నాపై క్రుమ్మరించినావే
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
నిన్ను హింసించిన నన్ను సహించి
నిన్ను దూషించిన నన్ను ప్రేమించి
నీ కృపతో అల్పుడనైన నన్ను నింపి
నీ సేవకు పిలచి నన్ను హెచ్చించి
నీ దయతో నన్ను మార్చి
నీ కృపతో నన్ను నడిపే
యేసయ్యా! నీ కృపయే నాకు చాలయ్య
యేసయ్యా! నీ కృపయే నాకు బలమయ్యా
Youtube Video
More Songs
Ne Gelichedanu Song Lyrics | Prabhu Pammi | Latest Telugu Christian songs 2024