ప్రభు నీదు సన్నిధిలో – సంపూర్ణ సంతోషం | El-Bethel Song Lyrics | Prabhu Needhu Sannidilo Song | Asher Andrew | Latest Telugu Christian Song 2026

Table of Contents
El-Bethel Song Lyrics
ప్రభు నీదు సన్నిధిలో – సంపూర్ణ సంతోషం
పరవశమొందే నా మది నీ సన్నిధి చేరి (2)
ఎల్ బేతేల్ – ఎల్ బేతేల్
బేతేలు దేవుడే నా దేవుడు(2)
ఆరాధన ఆరాధన – ఆర్పజాలని ఆరాధన (2)
నీవిక్కడ ఉన్నావు – నన్ను దర్శించావు – నా దిశనే మార్చావు
కృతజ్ఞత బాష్పాలతో – తడిపెద నీ పాదాలను (2)
1) ఎడారిలో నే బాటసారిలా – వెంటాడే నే నాదు చేదు గతం
గురిలేని జీవిత వలయంలో – పోరాడి అలసి సోలితిని
జీవాలయంలో నను తాకి – సంవృద్ధి జీవముతో నింపితివి(2)
నా దేవుని మందిరముబులో
క్షణమైన నే విడచి బ్రతుక జాలను (2)
||ఎల్ బేతేలు||
2) ఇహలోక మహిమను వెంటాడుతూ అంతా చివరికి మోసమని
ఏదియు నాతోడు రాలేదని – ఏకాకిగా నేను మిగిలితిని
నీ తేజో మహిమను చూపావు – నాతో నిబంధన చేసావు(2)
నీవిచ్చిన మాటను నెరవేర్చు వరకు
విడువక ఎడబాయక ఉందునంటివి (2)
||ఎల్ బేతేలు||
3) సంపాదనే నాదు ధ్యేయమని – ఇహలోకమే నాకు సర్వమని
పరలోక గవి నే మరచి – పరమార్థాన్నే విడచితిని
అంతా భ్రాంతియేనని ఏదీ నాది కాదని (2)
నీవే నాదు సర్వమని – గ్రహించి నీ సన్నిధి చేరితిని (2)
||ఎల్ బేతేలు||
Youtube Video

More Songs
