Nee Krupathishayamu Song Lyrics | Dr. Asher Andrew | The Life Temple | Latest Telugu Christian Song 2025

Table of Contents
Nee Krupathishayamu Song Lyrics
నీ కృపాతిశయమును అనునిత్యము-2
నే కీర్తించెద తరతరములకు
నీ విశ్వాశ్యతను నే ప్రకటించెద
మౌనిగా… ఎటులుండెదా- సాక్షిగా…
ప్రచురించక నా తుదిశ్వాస వరకు
నీ చెంత చేరే వరకు-2
ఇంకా బ్రతికి వున్నామంటే అది కేవలము నీ కృపా
ఇంకా సేవలో వున్నామంటే- అది కేవలము నీ కృపా
ఏమంచితనము లేకున్నను- ఏమంచితనము లేకున్నను
కొనసాగించినది నీ కృపా – నిలబెట్టుకున్నది నీ కృపా
|| నీకృపా||
పది తరములకు వెంటడినా- మోయాబు శాపము నీ కృప
శరణు వేడగా మార్చేనే వేయి తరముల్ అన్యురాలైన ఆ
రూతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను
దీవించగా యే శాపము నాపై పనిచేయదు
|| నీకృపా||
ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా
మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృపా
కృపతోనే రక్షణ ఇచ్చావు. నా కియ వలన కానేకాదు
జీవితమంతా ఋణస్థుడను- నీయందే నిత్యము అతిశయము
|| నీకృపా||
ఇల్లు వాహనమున్నయంటే- నీదు కృపాదానమే
బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే
ఏమర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నాయెడల
జీవితమంతా కృతజ్ఞుడను -జీవితమంతా పాడెదను
||నీకృపా||
ప్రియులే నన్ను విడనాడినా శోకమే నాలోకమా
అనాధ గానే మిగిలానే నాకధ ముగిసినదే
నీ కుడి చేతిలో ఉంచగానే బెన్యమీనువంతుగామారె
ఐదంతాలయే నా భాగ్యము విధి రాతనే మార్చే నీ కృపా
||నీకృపా||
Youtube Video

More Songs

Pingback: Neeve Naa Anandham Song Lyrics | Latest Telugu New Year Song 2025 - Ambassador Of Christ
Pingback: Vivaham Devuni Nirnayam Song Lyrics | Vaibhavame Song Lyrics | Latest Christian Wedding Song 2025 | Samy Pachigalla - Ambassador Of Christ
Pingback: Undedhevaru Poyedhevaru Song Lyrics | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ