ఇమ్మానుయేలు 2 | Emmanuel 2 Song Lyrics | Vakyame Sareeradhariga Song | Elohim Music | Latest Telugu Christmas Song 2025

Table of Contents
Emmanuel 2 Song Lyrics
[Verse 1]
వాక్యమే శరీరధారిగా వచ్చేనే భువికి
లోకమే తెగ ఉల్లసించెగా రక్షకుడు వచ్చే దరికి
నింగి లోని తారాలన్నీ పాడే హోసన్నా
దూతలు స్తోత్ర గాణములు చేసే హోసన్నా
లోకమేలే రారాజు ఏతెంచెగా
దేవదేవుని అద్వితీయ పుత్రుడే శాపాన్ని తొలగింపఏతేంచేగా
[Chorus]
కనివిని ఎరుగని కరుణామయుడే
కన్య గర్భమున జన్మించేనా
కాలములు వశములో కలిగిన వాడే
నరరూపుడాయెనుగా
[Verse 2]
దీనుడవై నీవు మనుజాళి కోసం
దారిద్ర రూపాన్ని దాల్చావాయా
పరమాత్మా సుతుడా పరిశుద్ధ దేవా
పరలోక సౌఖ్యాన్ని వదిలావయా
ఆదియు అంతము అయినా వాడే
ఈ పాపికొరకు నరరూపుడాయె
తండ్రి నీ ప్రేమను వర్ణింపను
నా మాట నా పాటలెన్నైనను చాలవు
[Chorus]
ఇహ పరమున నీవే ఏలిన వాడా
ప్రభువులకు ప్రభువా యెహోవా సుతా
తండ్రి శుద్ధాత్మలతో ఉన్న వాడా
యేసయ్య నా మెస్సయా
[Bridge 1]
అనాది నుండి ఉన్న వాక్యమే
నారావతారమెత్తి వచ్చేనా
ఆ నింగి లోని వింత తారాయె నీ జాడాతెల్ప ఉద్బవించెనా
దూతలు పాడి కొనియాడి కీర్తించారయ్య
గొల్లలు జ్ఞానులు పొగిడి కొలిచారు నిన్ను
పరలోక సోక్యం వదిలివే మాకి
దాసుని రూపమునే ధరియించావు
[Verse 3]
దేవాది దేవా పరలోక రాజా
మహిమను విడిచిన మహనీయుడా
సింహాసనమును విడనాడి నీవు
రిక్తునిగా మారవు నాకోసమే
శూన్యంబులోనుండి సర్వంబును
సృజియించిన నా సర్వేశ్వరా
మనుషులు చేసిన పాపాలకు
బాలియాముగా మార నేతించినా మెసయ్య
[Chorus]
ఆది దంపతులను సృష్టించిన వాడా
ఆకాశమే నీ సింహాసనమా
ఆది అంతము లేని ఆత్మరూపా (ఆరాధ్యుడా
ఆల్ఫా ఒమేగా నీవే
[Bridge 2]
ఇమ్మానుయేలు అనాదిలోని వాక్యమే
ఇమ్మానుయేలు శరీరమున్ ధరించేనా
ఇమ్మానుయేలు నిన్న నేడు నిరంతరం
ఇమ్మానుయేలు మా తోడువై ఉన్నవుగా
ఇమ్మానుయేలు దేవాది దేవా పుత్రుడా
ఇమ్మానుయేలు మా దేవా నీతి సూర్యుడా
ఇమ్మానుయేలు మార్గము
ఇమ్మానుయేలు సత్యము
ఇమ్మానుయేలు జీవమైనవాడవూ
కరములు ఎత్తి నినుమే కీర్తించెదమయ్య
సిలువలోమకై ప్రాణం పెట్టిన యేసయ్య
సర్వన్నతస్థలములలో నీకీ మహిమ
భువిపై నీకిష్టులకు సమాధానం
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా
హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా హోసన్నా
Youtube Video

More Songs
Mahimaanvithudu Song Lyrics | Latest Telugu Christian Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.

Pingback: Agocharudu | Rakshakuni Janmastalama Song Lyrics | Hosanna Ministries | Latest Telugu Christmas Song 2025 - Ambassador Of Christ
Pingback: Ghanaheena Mainadi | Varamu Song Lyrics | Enoch Abraham | Latest Telugu Christmas Song 2025 - Ambassador Of Christ