Gundelotulona Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024 

గుండె లోతులోన కురిసెను | Gundelotulona Song Lyrics Telugu | Bro Mathews | Krupa Ministries | Latest Telugu christian Songs 2024 

Gundelotulona Song Lyrics Telugu

Gundelotulona Song Lyrics Telugu

పల్లవి:
గుండె లోతులోన కురిసెను నీ కృప వాక్యము
శోధనంత తొలిగి సోపానమాయెను నా జీవితం (2)
ఏనాటికి తరగని కృప నాపై చూపి
ఆత్మీయ శిఖరముపై నా అడుగులు స్థిరపరిచితివి (2)

అ.పల్లవి:
యేసయ్య యేసయ్య నా ఔన్నత్యము నీవేనయ్యా
యేసయ్య యేసయ్య నా జీవన సారధివి నీవేనయ్యా (2)
||గుండె లోతులోన||

నడిచే మార్గముకు గమ్యం తెలియక
కృంగిన హృదయముతో కన్నీరు కార్చితిని (2)
నీవే చెలికాని వై చెంతన నిలువగా
నీ చెలిమే నా బలమై గమ్యం తెలిపెను (2)
||యేసయ్య||

కార్చిన కన్నీళ్ళతో పూలను పూయించి
ఏడ్చిన ఎదలోని ఫలములు పండించితివి (2)
నాలో నీవుండి నీతో నడిపించి
పరిమళ వాసనగా నా బ్రతుకును మార్చితివి (2)
||యేసయ్య||

నీ వాక్యమే నా హృదిలో జీవము నింపెను
అది నా పాదములకు దీపమాయెను (2)
జీవము నీవని నీవే నిజమని
సీయోను పురములో నీతో జీవింతును (2)
||యేసయ్య||

Youtube Video

More Songs

NANU DEEVINCHAVU SONG LYRICS | SRESHTA KARMOJI | SUHAS KARMOJI | LATEST TELUGU CHRISTIAN SONGS 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top