ఇద్దరు ఒకటాయెను నేడే | Iddaru Okataayenu Song Lyrics |A Lovely Wedding Melody 2025

Table of Contents
Iddaru Okataayenu Song Lyrics
పల్లవి:
ఇద్దరు ఒకటాయెను నేడే
ఇరు మనసులు కలిసెనులే
జరిగెను వివాహ మహోత్సవమే
మొదలాయె చిరకాల బంధమే
కోరస్:
ఇది సంబరమే మీ ఇద్దరి వివాహమే
సంతషమే బంధుమిత్రులందరికీ
చరణం1:
అలనాడు దేవుడే జతచేసెనే ఒకరిని ఒకరికి తోడుగా
వరునికి వధువును సాటియయిన సహాయముగా ఇచ్చెనే
ఎల్లకాలం కలిసుండే దేవుని ప్రేమ సాక్షులుగా
మీ ఇద్దరినీ కలిపేను ఒక గూటి పక్షులుగా
కురిసెనులే ఇప్పుడే మీపై దేవుని ఆశీర్వాదములు
కోరస్:
ఇది సంబరమే మీ ఇద్దరి వివాహమే
సంతషమే బంధుమిత్రులందరికీ
చరణం2:
అన్నిటికంటే ఘనమయినదిగా పరిశుద్ధమైన వివాహము
ఒంటరికంటే జంటగా మేలని దేవాదిదేవుడే తలచెనే
రెండు మనసుల తలపులే పాటగా శృతిచేసేది
అనురాగాలు మీటి సుస్వరాలు పలికించేది
మెండైన దీవెనలు నిండెలే మీ జీవితాంతము
కోరస్:
ఇది సంబరమే మీ ఇద్దరి వివాహమే
సంతషమే బంధుమిత్రులందరికీ
చరణం3:
ఏకశరీరముగా జీవితాంతము నిలిపే బంధం వివాహమే
సహనము కలిగి ఓర్పుతో మెలిగే ఇరువురి బంధం వివాహమే
ఒకరినొకరు ప్రేమతో పెనవేసుకొనే బంధం మీది
ఏ మనుష్యుడూ విడదీయరాని అనుబంధం ఇది
మీకు కృపా క్షేమములు ఎల్లప్పుడు కలుగును గాక ఆమెన్
Youtube Video

More Songs
Pelli Kumarudu Song Lyrics | Ankit Reddi | Sreshta Karmoi | Latest Christian Marriage Songs 2025
