Jayamu Keerthanalu Song Lyrics || Bible mission Songs || Old Is Gold

జయము కీర్తనలు | Jayamu Keerthanalu Song Lyrics || Bible mission Songs || Old Is Gold

Jayamu Keerthanalu Song Lyrics

జయము కీర్తనలు – జయశబ్దముతో రయముగ పాడండి – జయము జయ మాయెను లెండి – జయమే క్రీస్తుని చరిత్ర యంతట – జయమే మరణమున – గూడ జయమే నిత్యమును – సద్విలాస్

యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే – ఎల్లవారికౌను – కోరిన యెల్ల వారికౌను – వేడిన యెల్లవారికౌను – నమ్మిన యెల్ల వారికౌను = యేసు పేరే మీ చిక్కుల పైన వేసికొన్న జయము – జయమని వ్రాసికొన్న జయము – సద్విలాస్
||జయ||

జయము రాక పూర్వంబే – జయమను జనులకు జయమౌను – స్తుతించు జనులకు జయమౌను – స్మరించు జనులకు జయమౌను – ప్రకటించు జనులకు జయమౌను = జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల యిక నపజయ పదమే కల్ల – సద్విలాస్
||జయ||

అక్షయ దేహము దాల్చితి వీవు – ఆనంద మొందుమీ = లక్షల కొలది శ్రమలు వచ్చిన – లక్ష్యము పెట్టకుమీ = నీవు – లక్ష్యము పెట్టకుమీ – సద్విలాస్
||జయ||

తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు, తుక్కు, తుక్కు = అపాయ మేమియు రాదు నీకు – అది నీకు లొక్కు – నిజముగ అది నీకే లొక్కు – సద్విలాస్
||జయ||

వచ్చివేసిన దేవుని సభకు – చేరుదము రండి = త్వరలో యేసును కలిసికొని విని – దొర లౌదము రండి – నిజముగా – దొర లౌదము రండి – సద్విలాస్
||జయ||

Youtube Video

Jayamu Keerthanalu Song Lyrics

More Songs

Bahugaa Praardhana Cheayudi Song Lyrics | Bible Mission Songs| M.Devadasu Ayyagaaru

1 thought on “Jayamu Keerthanalu Song Lyrics || Bible mission Songs || Old Is Gold”

  1. Pingback: Ghana Parchudi Devuni Song Lyrics | Bible Mission Songs | Baptism Song - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top