కలువరిలోన కరిగినావా | Kaluvarilo Kariginava Song Lyrics | Latest Telugu Christian Song 2025

Table of Contents
Kaluvarilo Kariginava Song Lyrics
పల్లవి:
కలువరిలోన కరిగినావా
కరుణామయుడా నా దేవా
కరుణ చూపు కరములు చాపి
నిలిచినావా నాకై
అవధులే లేనిది నీ ప్రేమ
అది ఆకాశము కంటే ఉన్నతమైనది
నా రక్షణకై మహిమనంత విడచి
కడుదీనుడవై అరుదించినావా
పరముకు నన్ను చేర్చుటకై
పరితపించినావా నా యేసయ్య
ఆఖరి రక్తపు బొట్టును నాకై చిందించితివా
చరణం:1
ముళ్ళ కిరీటం శిరమున ధరియించినారే
మొహము మీద ఉమ్మి వేసి గేలిచేసినారే
పిడుగుద్దులు గుద్ది నిన్ను హింసించినారా
కొరడాలతో కొట్టి బాధించినారా
ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్య
ఏ రీతిగా నిన్ను స్తుతించెదనయ్యా
ప్రేమ ప్రేమ నా యేసయ్య ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసయ్య ప్రేమ
చరణం:2
తల్లి కంటే మిన్నగా నన్ను ప్రేమించినావా
తనువంతా నాకై చాలించినావా
వేదనలో నన్ను నీవు ఓదార్చినావా
శ్రమలలో తోడై నన్ను నడిపించినావా
శాశ్వతమైన నీ ప్రేమ చూపినావా
నిత్యజీవ మార్గములో నన్ను నిలిపినావా
ప్రేమ ప్రేమ నా యేసయ్య ప్రేమ
ప్రేమ ప్రేమ నా యేసయ్య ప్రేమ
Youtube Video

More Songs
