నా కోసం బలియైనా | Naa Kosam Baliyaina Song Lyrics | Latest Telugu Good Friday song 2025 | Gani Cantor
Table of Contents
Naa Kosam Baliyaina Song Lyrics
పల్లవి:
నా కోసం బలియైనా నా యేసయ్య
నా పాపము మోసితివి నా యేసయ్య (2)
విలువ లేని నన్ను బ్రతికించావు
భారమంతా నీవు భరియించావు (2)
నే తీర్చలేను నీ రుణము నా యేసయ్య
నీ త్యాగమును మరువలేను నా యేసయ్య (2)
( నా కోసం )
చరణం1 :
మా క్షేమము కోరితివి,
నీ ప్రేమను చూపితివి,
మా కొరకై నీ మహిమను వదులుకుంటివి
తండ్రితో ఉండే భాగ్యం,
మాకోసం విడిచేసి,
మా పోలికగా పుట్టి మరణించితివి
ఆ గాయములే నిను బాధించే,
బరువైన ఘోరమైన సిలువను మోసే
మా దోషములే నిను హింసించే,
నీ రక్తపు బిందువులే రక్షణనిచ్చే
అయ్యా…… యేసయ్యా……
అయ్యా…… యేసయ్యా……(2)
నిలువెళ్ల నలిగిన, వధకు సిద్ధమైతివి, తుదకు త్యాగమైతివి
నే తీర్చలేను నీ రుణము నా యేసయ్య
నీ త్యాగమును మరువలేను నా యేసయ్య (2)
( నా కోసం )
చరణం2 :
నీలో నను చేర్చితివి,
నీ మార్గం చూపితివి,
నీ వెలుగును చూపి కనుమరుగైతివి
నీ కరుణను చూపితివి,
నీ కృపను ఇచ్చితివి,
భువిపైన నీ ప్రాణం అర్పించితివి
ఆ రోదనతో కేకలు వేసి,
కొరడాలతో కొడుతుంటే విలపించితివి
మా పాపములే నీవు విడిపించే,
నీ రక్తప్రోక్షణతో నను కడిగించే
అయ్యా…… యేసయ్యా……
అయ్యా…… యేసయ్యా……(2)
నిను ఉమ్మి వేసిన, నీవు మౌనివైతివి, నోరు కదపకుంటివి
నే తీర్చలేను నీ రుణము నా యేసయ్య
నీ త్యాగమును మరువలేను నా యేసయ్య (2)
( నా కోసం )
Youtube Video
More Songs
Neela Lerevaru Song Lyrics | Latest Telugu Christian Song 2025 | Christ Alone Music | Vinod Kumar
Pingback: Triyekuda | Najareyidaina Na Yesu Deva Song Lyrics | Gani Cantor | Latest Telugu Christian Song 2025 - Ambassador Of Christ