Nannu Diddumu Chinna Prayamu Song | Andhra Kraistava Keerthanalu |Sri Mungamuri Devasayya garu

నన్ను దిద్దుము చిన్న ప్రాయము | Nannu Diddumu Chinna Prayamu Song | Andhra Kraistava Keerthanalu |Sri Mungamuri Devasayya garu

Nannu Diddumu Chinna Prayamu Song

Nannu Diddumu Chinna Prayamu Song Lyrics

నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయన – నీవు కన్నతండ్రివంచు నేను – నిన్ను జేరితి నాయన
|| నన్ను ||

దూరమునకు బోయి నీదరి – జేరనైతిని నాయనా = నేను కారు మూర్ఖపు బిడ్డనైతిని – కారువనమున నాయనా
|| నన్ను ||

మంచి మార్గములేదు నాలో – మరణపాత్రుడ నాయనా = నేను వంచితుండనైతి నీ ప్ర-పంచమందున నాయనా
|| నన్ను ||
చాలామారులు తప్పిపోతిని – మేలుగానక నాయనా = నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా
|| నన్ను ||

జ్ఞానమంతయు పాడుచేసి – కాననైతిని నాయనా = నీవు – జ్ఞానము గల తండ్రివని – జ్ఞప్తివచ్చెను నాయనా
|| నన్ను ||

కొద్ది నరుడను దిద్దునను నీ – యొద్దజేర్పుము నాయనా నీ = యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దునైతిని నాయనా
|| నన్ను ||

ఎక్కడను నీ వంటి మార్గము – నెరుగనైతిని నాయనా = నీ – రెక్క చాటున నన్నుజేర్చి – చక్కపరచుము నాయనా
|| నన్ను ||

శత్రువగు సైతాను నన్ను – మిత్రుజేయును నాయనా = ఎన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రములకో నాయనా
|| నన్ను ||

వాసిగానె పాపలోకపు – వాసుడనో నాయనా – నీ దాసులలో నొకనిగా నను – జేసి కావుమి నాయనా
|| నన్ను ||

Youtube Video

More Songs

సంరక్షక | Samrakshaka Song Lyrics | LATEST NEW TELUGU CHRISTMAS SONGS 2023 | PRABHU PAMMI

1 thought on “Nannu Diddumu Chinna Prayamu Song | Andhra Kraistava Keerthanalu |Sri Mungamuri Devasayya garu”

  1. Pingback: Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs 99 | Jesus Second Coming Song - Ambassador Of Christ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top