శ్రీయేసు క్రిస్తు నాధుడు | Sriyesu Kristhu Nadhudu Song Lyrics | Bible Mission Songs | Jesus Second Coming Song | Devadas Ayyagaru
Table of Contents
Sriyesu Kristhu Nadhudu Song Lyrics
శ్రీయేసు క్రీస్తు నాధుడు – శీఘ్రముగ వచ్చును = ఆ – యంశముపై పండుగ – చేయ లెండి రండి ప్ర – సిద్ధి గావించుచు
|| శ్రీయేసు ||
త్వరగా యేసు వచ్చు నంచు – దైవ వాక్యమనుచు నుండ = త్వరగ ననియె నమ్ముచున్న – ధన్యుడవై సి – ద్ధంబు కాగలవు
|| శ్రీయేసు ||
త్వరగా క్రీస్తు వచ్చునంచు – దైవ వాక్యమనుచు నుండ = త్వరగ రాడు కాలయా – పనము చేయునన్న నా – పద గలుంగు వెళ్ళవు
|| శ్రీయేసు ||
యేసు క్రీస్తు ప్రభువు భువికి – నెపుడు వచ్చినన్ గాని = ఈ సమయము నందె యంచు – నెపుడు నమ్ముచున్న యెడల నెగిరి – వెళ్ళగలవుగ
|| శ్రీయేసు ||
మొదటి రాక వచ్చునన్న – పదము సిద్ధించెను = ఇదియు సిద్ధించును యేసు త్వరగ వచ్చును – ఎత్తబడును సంఘము
|| శ్రీయేసు ||
నమ్మరాదనుచు యే – నరుడు చెప్పుచున్నను = నమ్ముచుండుము దేవుని – వ్రాతవాక్యము – సత్యమంచు – నెమ్మది నీ కపుడెకల్గు
|| శ్రీయేసు ||
Youtube Video

Songs Credits

More Songs
Nannu Diddumu Chinna Prayamu Song | Andhra Kraistava Keerthanalu |Sri Mungamuri Devasayya garu
