నిన్ను నమ్మిన నా యెడల | Ninnu Nammina Naa Yedala Song Lyrics | Emmanuel Ministries Telugu Christian Song 2026
Table of Contents
Ninnu Nammina Naa Yedala Song Lyrics
పల్లవి :
నిను నమ్మిన నా యెడల కృప చూపుచున్నావయ్యా
నిను ప్రేమించువారికి ఆశ్రయమై ఆదుకుంటివి (2)
దాటి వెళ్లని దయగల దేవుడవు (2)
దారిచూపే – దయామూర్తివి
నీవే మాకు ఆధారమైతివి – అంధకారలోయలో అభయుడవై (2)
|| నిన్ను నమ్మిన ||
చరణం 1:
మహోన్నతుని చాటున నన్ను దాచితివి
ఏ హాని సమీపించనియ్యక – బలమైన భాహువును చూపితివి
నా భారమైన భాధ్యతను భరించుటకే (2)
కల్వరిగిరిలో కార్చిన రక్తమే – నా రక్షణకు కారణమాయెనా (2)
విజయవీరుడా నీకే ఆరాధనా
మృత్యుంజయుడా నీకే ఆరాధనా
మహిమాన్వితుడా నీకే ఆరాధనా
అత్యున్నతుడా నీకే ఆరాధనా
చరణం 2:
శ్రేష్ఠమైన వాక్కుతో నను పిలచితివి
నీ ఘనమైన పరిచర్యకోసమే
అనాధి సంకల్పమును నెరవేర్చుటకే
అనాధనైన నా యెడల కృప చూపితివి (2)
తల్లి గర్భములో రూపించకమునుపే
నన్నెన్నుకున్నావు నీ సాక్షిగా (2)
చరణం 3:
నీ నిత్యమహిమకు నన్ను నియమించితివి
సదాకాలము నీతో ఉండుటకు
అఖండమైన విజయమును నాకిచ్చుటకే
అనంత ప్రేమ నా మీద కురిపించితివి (2)
యెహోవా భాహువా లెమ్మూ రమ్మూ
మేఘమువలె నన్నావరించుము (2)
Youtube Video
More Songs
Sarvaloka Adhinethave Song Lyrics | Emmanuel Ministries | Latest Telugu New Year Song 2025
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.