నిన్ను స్తుతియిస్తే చాలునయ్యా | Ninnu Stuthiyiste Chaalunayya Song Lyrics | Latest Telugu Christian Song 2026
Table of Contents
Ninnu Stuthiyiste Chaalunayya Song Lyrics
పల్లవి:
నిన్ను స్తుతియిస్తే చాలునయా నా స్థితిగతులు మారునయా “2”
నిన్ను స్తుతియిస్తే చాలునయా నాకు క్షేమము కలుగునయా “2”
నీవు మా పక్షమై నిలువగా మాకు విరోధి ఎవరయ్యా..
నీవు మా ముందరే నడువగా ఇక జయధ్వనులు చేసెదమయ్యా “2”
యేసయ్యా..యేసయ్యా..
నీకే స్తుతిగానము చేసెదన్ జయసునాధము
శాపమే నన్ను వెదకి వెంటాడి బ్రతుకే లేకుండా చేయచూడగా “2”
కృప శాసించుచూ ఉండగా కీడేది దరి చేరలేదయా
నీ సన్నిధి తోడుండగా నాకు ఏ హాని కలుగలేదయా “2” .
యేసయ్యా..యేసయ్యా
స్వార్థము చూపే లోకబంధాలు నలుదిశలా ఒంటరి చేసినా “2”
నీవే ఇమ్మానుయేలువై యుండి సదా నా తోడుండెదవయ్యా
మహిమలో నేను చేరువరకు నను ఎన్నడు విడువవయా “2”
యేసయ్యా..యేసయ్యా..
జీవముతోనే మ్రింగివేయ శత్రువులే నను ఆవరించగా “2”
యెహోవా నిస్సీవై యుండి నా పక్షముగా నిలిచావయా
శత్రు పన్నాగములన్నియు నిరర్థకము చేసావయ్యా “2”
యేసయ్యా..యేసయ్యా..
Youtube Video
More Songs
Thank you for visiting our website. We truly appreciate your time and interest. Your presence supports our mission to provide valuable, user-friendly content. We hope you found it helpful and look forward to welcoming you back again.
Praise the lord sister 🙏
My fvrt song మహా ఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా
Preparing for the exam
praise the LORD amma
All the Best