పాపుల స్నేహితుడై | Paapula Snehithudai Song Lyrics | A.R.Stevenson | Latest Telugu Christmas Song 2024
Table of Contents
Paapula Snehithudai Song Lyrics
పాపుల స్నేహితుడై బలహీనులకాశ్రయుడై
దేవుడే జన్మించె దీనుడై (2)
ఉద్ధరించువాడై దాక్షిణ్యపూర్ణుడై (2)
చెలికాడై మనతోడై అందాల బాలుడై
అ.ప.
యూదాగోత్ర సింహము అతడే
అయినా గొర్రెపిల్లగా ధరణికొచ్చాడే (2)
|| పాపుల స్నేహితుడై ||
రక్షణిచ్చువాడై దోషాలు మరచు విభుడై
పరిశుద్ధత కలిగించు దేవుడై (2)
పరలోకము చేర్చే అధికారముగల ఘనుడై (2)
చెలికాడై మనతోడై అందాల బాలుడై
|| యూదాగోత్ర ||
జ్ఞానమిచ్చువాడై ద్వారాలు తెరచు ప్రియుడై
ఎడబాయక నడిపించు దేవుడై (2)
ప్రతి అక్కర తీర్చే మమకారముగల హితుడై (2)
చెలికాడై మనతోడై అందాల బాలుడై
|| యూదాగోత్ర ||
దీవెనిచ్చువాడై సంతోషపరచు వరుడై
అభివృద్ధిని జరిగించు దేవుడై (2)
స్థితి స్థానము మార్చే సుగుణాలశీల ధనుడై (2)
చెలికాడై మనతోడై అందాల బాలుడై
|| యూదాగోత్ర ||
Youtube Video
More Songs
Ee Anandam Ne Janmatho Song Lyrics | Bro. Samuel Karmoji | Latest Telugu Christmas Song 2024
Pingback: Rakshana Sunadhamu Song Lyrics | Latest Telugu Christmas Song 2024 | Surya Prakash Injarapu - Ambassador Of Christ
Pingback: Harmony Season1 Christmas Song Lyrics | Jagamula Nele Raaraju Song Lyrics | Latest Telugu Christmas Song 2024 - Ambassador Of Christ
Pingback: Nee Kanupaapavale Song Lyrics | AR Stevenson | New Year Song 2025 - Ambassador Of Christ