స్తుతియింతును నీ నామం | Sthuthiyinthunu Nee Namam Song Lyrics | JK Christopher | Latest Telugu worship song 2025
Table of Contents
Sthuthiyinthunu Nee Namam Song Lyrics
స్తుతియింతును నీ నామం ప్రభువా నే ననుక్షణం
ధ్యానింతును నీ వాక్యం హృదయములో నిరంతరం
నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయము
నీవే నా ఆనందం ప్రభు నీవే నా సమస్తము
గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను
అపాయమేమియు రాకుండగా నను కాచి నడిపితివి (2)
నీవే నా అతిశయము నా కోట నా బలము
నీవే రక్షణశృంగము నా కేడెము నా శైలము
|| స్తుతియింతును ||
ఒంటరిగా ఏ తోడులేక అలసియుంటిని
నీ ప్రేమ చూపి నన్నాదరించి థైర్యపరచితివి (2)
నీ ప్రేమ మరువనిదీ అది ఎన్నడు మారనిది
నీ ప్రేమ వీడనిది అది శాశ్వత మైనది
|| స్తుతియింతును ||
మరణపువ్యాథులు నన్నావరించి కృంగదీసిన
నీ కరుణ చూపి నను స్వస్తపరచి జీవమిచ్చితివి (2)
నీవే నా వైద్యుడవు వైద్యులకే వైద్యుడవు
నీవే సజీవుడవు నిజమైన దేవుడవు
|| స్తుతియింతును ||