పుణ్య కథలు ఆలకించండి | నమ్మి జీవించుడి – శ్రీ యేసు క్రీస్తున్ | భయపడ రాదు – జనాంగమా | Telugu Kraistava Keerthanalu 103 104 105 | Bible Mission Songs | Repent Faith over Fear | Devadas Ayyagaru
Table of Contents
Telugu Kraistava Keerthanalu 103 104 105
పుణ్య కథలు ఆలకించండి – దేశీయులారా – పుణ్య కథలు ఆల కించండి = పుణ్య కథలు విన్నయెడల – పోవును మీ పాప రాశి – నాణ్యమైన దేవ వాక్కు నరులను రక్షించు వాక్కు
ఆలకించు చెవుల నిచ్చెను – దేవాది దేవుడు ఆలకించు శక్తి నిచ్చెను = ఆలకించు తెలివి గలిగి అన్నియు పరీక్ష చేయు వాలు తెలిసి – దైవ సత్యము బైలుపడును పూర్తిగాను
ఆలకించుచున్న వారిని – పగవాడు చూచి ఆలకింపకుండ జేయును = మేలు మాటలాలకించి = మిగత మాట లాలకింప జాలకండి నట్టి తెల్వి – జన్మమందె దేవుడిచ్చె
నమ్మి జీవించుడి – శ్రీ యేసు క్రీస్తున్ – నమ్మి జీవించుడి = నమ్మిన వారికి నరకము తప్పును – నమ్మిన వారికి మోక్షము దొరుకును
|| నమ్మి ||
నెమ్మదిగా యిది యంతయు విన్న – నమ్మ గలడుగలరు ఈ – నరుడీ కథలు
|| నమ్మి ||
నమ్మిక కొరకు ప్రార్ధన చేసిన – నమ్మిక వరమై నడుచును గాన
|| నమ్మి ||
భయపడ రాదు – జనాంగమా – భయపడ రాదు జనాంగమా = భయపడ రాదు మిమ్ము – భయపెట్ట రాలేదు – దయతో దీనిని విని దలచుకొనండి
|| భయ ||
బ్రతుకు దెరువైనట్టి – పాటలు మాటలు – మతికి వినోదమౌ – మహిమ కథ ఆలించండి
|| భయ ||
అదరిపో రాదు మరియు – బెదరి పోరాదు – సదమలముగ విని – మదిని ధ్యానించుడి|| భయ ||
Youtube Video

నమ్మి జీవించుడి – శ్రీ యేసు క్రీస్తున్
Song Credits

More Songs

Pingback: Popove Oo Satana Song Lyrics | Bible Mission Songs | Telugu Kraistava Keerthanalu - Ambassador Of Christ