మాయరా ఇది మాయరా | Telusuko Chellemma Song Lyrics | Latest Telugu Christian Song 2025
Table of Contents
Telusuko Chellemma Song Lyrics
మాయరా ఇది మాయరా
సోదరి ఇది మాయరా (2)
చూస్తున్నది.. తలస్తున్నది..
వింటున్నది.. ఊహిస్తున్నది..
చూస్తున్నది.. తలస్తున్నది..
వింటున్నది.. ఊహిస్తున్నది..
ఈ లోకమే మాయరా
వెన్నవంటి మృదువైన మాటని
చెవినే విడిచిపెట్టబోకుమా
కలహమున్నదని తెలుసుకోసుమా
ఊరంత అల్లరి పాలవకుమా
చమురుకంటే నునుపైన మాటలో
విషంపూసిన ఖడ్గమున్నదని
లాలననే మత్తులో దింపి
అమ్మకానికై నిలబెడతారని
తెలుసుకో చెల్లెమ్మా…
మొసలి కన్నీటికి చలించకుమా
నిను మ్రింగివేయునని ఎరుగుమా
లోకం చూపే పలురంగులకు
పువ్వంటి ఉనికి కోల్పోకుమా
నువ్వేలేక నే బ్రతుకలేననే
అబద్ధాల వలలోన చిక్కకుమా
పణంగా ప్రాణం పెట్టిన యేసుదే
నిజమైన ప్రేమని గ్రహించుమా
తెలుసుకో చెల్లెమ్మా…
మాయరా ఇది మాయరా
సోదరి ఇది మాయరా (2)
చూస్తున్నది.. తలస్తున్నది..
వింటున్నది.. ఊహిస్తున్నది..
చూస్తున్నది.. తలస్తున్నది..
వింటున్నది.. ఊహిస్తున్నది..
ఈ లోకమే మాయరా…
Youtube Video
More Songs
Devudu Unnadu Jagratha Song Lyrics | Latest Telugu Christian Songs 2025