తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి | Thalladille Thalli Kanna Song Lyrics | Amaramaina Prema Song Lyrics | Hosanna Ministries 2025 Latest Song Pas.JOHN WESLEY Anna

Table of Contents
Thalladille Thalli Kanna Song Lyrics
తల్లడిల్లె తల్లికన్న మించి ప్రేమించి…
తనువు తీరే వరకు నన్ను వీడువలేనంది…”2″
అదియే నే గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా…
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమగా…
నీ గుండె గుడిలో నన్ను చేర్చిన అమరమైన ప్రేమగా…”2″
ఊహకందని ప్రేమలోని భావమే నీవు..
హృదయమందు పరవసించు గానమే నీవు…
మనసు నిండిన రమ్యమైన గాయమే నీవు…
మరపురాని కలల సౌధం గురుతులే నీవు…
యెడబయనన్నావే నిజస్నేహమే నీవు…
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు…
దేహమందు గాయమైన కుదుటపదును కదా…
గుండె గాయము గురుతుపట్టిన నరుడు లేదు కదా…
నీవే…. నీవే.. యేసయ్యా…
నా అంతరంగము తరచి చూసిన గాఢమైన ప్రేమవు..
నను భుజము మీద మోసిన అలసిపోని ప్రేమవు…
నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్య…”2″
ఊహకందని ప్రేమలోని భావమే నీవు…
హృదయమందు పరవశించు గానమే నీవు…
తల్లడిల్లె తల్లి కన్న మించి ప్రేమించి…
తనువు తీరే వరకు నన్ను విడువలేనంది…
నే గాయపరిచిన వేళలో కన్నీరు తుడిచిన ప్రేమగా…
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన క్రీస్తు ప్రేమగా….
Youtube Video

More Songs

Pingback: Ashrayuda Naa Yesayya Song Lyrics | Hosanna Ministries 2025 New Album Song-5 Pas.RAMESH Anna - Ambassador Of Christ