Undedhevaru Poyedhevaru Song Lyrics | Latest Telugu Christian Songs 2025

ఇదే చివరి దినమైతే | ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో | Undedhevaru Poyedhevaru Song Lyrics | Latest Telugu Christian Songs 2025

Undedhevaru Poyedhevaru Song Lyrics

Undedhevaru Poyedhevaru Song Lyrics

ఇదే చివరి దినమైతే – ఎటు వైపో నీ ప్రయాణం…
అదే పాత బ్రతుకైతే – రక్షణ పొందిన వ్యర్థం.

పల్లవి:-
ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో…
మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో (2)
జీవము దిగివచ్చింది – ప్రభు యేసుని రూపంలో
అవకాశము మనకొచ్చింది – పరలోకము చేరుటకూ

చరణం:-1
ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా
ఉన్నవి అన్నీ పోయేవేనని చెప్పెను యేసయ్యా (2)
చేప నోటిలో షెకెలు ఉందని తెలిసిన ఆయనకు
సృష్టిలో బహుసంపద ఉందని తెలియదా యేసునకు (2)
సిరికి దేవునికి… దాసులుగా ఉండలేమని
నాకు నేర్పించాలని… తాను కొదువ కలిగి జీవించాడు
( ఇదే )

చరణం:-2
తల్లిని విడిచిన జీవరాశులు తిరిగి రావయ్యా
రెక్కలు వచ్చి ఎగిరి పోతే గతమే గుర్తుకు రాదయ్యా (2)
నిన్ను విడిచిన నీ పిల్లలు నిన్ను చూడగ వస్తారు
దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు (2)
నీ తండ్రిని చూచుటకు… పరలోకం చేరుటకు
తప్పిపోయిన కుమారుడా… తప్పు దిద్దుకొని రావయ్యా…
( ఇదే )

చరణం:-3
క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్దపడవయ్యా
ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా (2)
నీ దుఖఃదినములను ఆనందముగా మార్చే దేవునితో
రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో (2)
సంచరించుటకూ… నువు సంతోషించుటకూ
నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించుము…
( ఇదే )

Youtube Video

More Songs

Nee Krupathishayamu Song Lyrics | Nee Krupathisayamunu Song lyrics | Dr. Asher Andrew | Latest Telugu Christian Song 2025

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top