Yedavaka Ooruko Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian songs 2024
Table of Contents
Yedavaka Ooruko Song Lyrics
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే (2)
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే (2)
|| ఎడవక ఊరుకో ||
ఎందరు ఉన్నా ఎవరు లేనట్టే
అందరు ఉన్నా నీ వారు కానట్టే (2)
ఒంటరి పాయణములో నువ్వు సాగుతున్న (2)
నీ పేరు పిలచి నిను చూసిన వాడు
తీరాలు దాటించి దరిచేర్చునులే (2)
|| ఎడవక ఊరుకో ||
పరిశోధనలో గుండె భారముతో
పరీక్షలలో నువ్వు సాగుతున్న (2)
దుఃఖసాగరంలో మునిగిపోతున్న. (2)
నీ హృదయమునెరిగి చూసుకునే వాడు (2)
తీరాలు దాటించి ధరిచేర్చునులే
ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే
మనసుకైన గాయము మానిపోయే సమయమైందిలే (2)
మారాను మధురంగా మార్చిన యేసయ్య
తీరాలు దాటించి ధరిచేర్చునులే (2)
Youtube Video
More Songs
Maha Devudu Song Lyrics | Latest Telugu Christian Song 2024 | Pranam Kamlakhar
Pingback: Hrudayalanele Raraju Song Lyrics | Akshaya Praveen | Latest Telugu Christian Songs 2025 - Ambassador Of Christ